Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 75

Parasurama- 2 !!

||om tat sat ||

బాలకాండ
డెబ్బది ఇదవ సర్గము

రామ దాశరథే రామ వీర్యం తే శ్రూయతేsద్భుతమ్|
ధనుషో భేదనం చైవ నిఖిలేన మయా శ్రుతమ్ ||

స|| హేరామ దాశరథే తే వీర్యం అద్భుతం ఇతి శ్రూయతే | ధనుషః భేదనం చ నిఖిలేన ఇవ మయాశ్రుతమ్ ||

తా|| "ఓ రామ ! దాశరథీ నీ పరాక్రమము అద్భుతము అని వింటిని. ధనస్సును భేధించుట గూడా ఆప్రతిధ్వనితో వింటిని".

తదద్భుతమచింత్యం చ భేదనం ధనుషస్త్వయా |
తత్ శ్రుత్వా అహమనుప్రాప్తో ధనుర్గృహ్య అపరం శుభమ్||

స|| తత్ ధనుషః త్వయా భేదనం అద్భుతం అచిన్త్యం చ | తత్ శ్రుత్వా అహం అపరం శుభం ధనుః గృహ్య అనుప్రాప్తః ||

తా|| "ఆ ధనస్సు నీ చేత భేధించపడిన విషయము అద్భుతము ఊహింపరానిది . అది విని ఇంకొక అతి శుభమైన ధనస్సుని తీసుకు వచ్చితిని".

తదిదం ఘోర సంకాశం జామదగ్న్యం మహద్దనుః |
పూరయస్వ శరేణైవ స్వబలం దర్శయస్వ చ||

స|| తత్ ఇదం ఘోర సంకాశం జామదగ్న్యం మహద్దనుః |(త్వం) శరేణైవ పూరయస్వ | స్వబలం దర్శయస్వ చ |

తా|| "ఇది ఆ జామదగ్నియొక్క భయంకరమైన మహత్తరమైన ధనస్సు. నీవు శరములతో సంధించుము. నీ బలమును ప్రదర్శించుము".

తదహమ్ తే బలం దృష్ట్వా ధనుషో అస్య ప్రపూరణే |
ద్వంద్వయుద్ధం ప్రదాస్యామి వీర్యశ్లాఘ్యస్య రాఘవ ||

స|| హే రాఘవ ! అస్య ధనుషః తత్ ప్రపూరణే అహం వీర్యశ్లాఘ్యస్య తే బలం దృష్ట్వా ద్వంద్వయుద్ధం ప్రదాస్యామి ||

తా || "ఓ రాఘవ ! ఈ ధనస్సును సంధించినచో నేను వీరులచే ప్రశంసించబడిన నీకు ద్వంద్వయుద్ధము ప్రసాదించెదను".

తస్య తద్వచనం శ్రుత్వా రాజా దశరథ స్తదా |
విషణ్ణవదనో దీనః ప్రాంజలిర్వాక్యమబ్రవీత్ ||

స|| రాజా దశరథః తస్య తత్ వచనం శ్రుత్వా విషణ్ణవదనః ప్రాంజలిః వాక్యం అబ్రవీత్ ||

తా|| దశరథ మహారాజు ఆట్టి ఆయన మాటలను విని విషణ్ణవదనముతో అంజలిఘటించి ఇట్లు పలికెను.

క్షత్రరోషాత్ ప్రశాంతస్త్వం బ్రాహ్మణశ్చ మహయశాః |
బాలానాం మమపుత్రాణాం అభయం దాతుమర్హసి ||

స|| మహాయశాః బ్రాహ్మణశ్చ త్వం క్షత్రరోషాత్ ప్రశాంతః మమపుత్రాణామ్ బాలానాం అభయం దాతుమర్హసి ||

తా|| " మహాయశస్సు గలవాడవు. బ్రాహ్మణుడవు. క్షత్రియులను వధించు కోపము చల్లారినది. నా కుమారులు బాలురు. అట్టి వారికి అభయమివ్వగలవాడవు".

భార్గవాణాం కులే జాతః స్వాధ్యాయవ్రతశాలినామ్ |
సహస్రాక్షే ప్రతిజ్ఞాయ శస్త్రమ్ నిక్షిప్తవానసి ||

స|| "నియమ నిష్ఠలతో అధ్యయనము చేయగల భార్గవుల కులములో జన్మించినవాడవు. సహస్రాక్షుని తో ప్రతిజ్ఞచేసి శస్త్రములు వదిలినవాడవు".

స|| (త్వం) స్వాధ్యాయ వ్రత శాలినామ్ భార్గవాణాం కులే జాతః | (త్వం) సహస్రాక్షే ప్రతిజ్ఞాయ శస్త్రం నిక్షిప్తవానసి |

స త్వం ధర్మపరో భూత్వా కాశ్యపాయ వసుంధరామ్ |
దత్వా వనముపాగమ్య మహేంద్రకృత కేతనః ||

స|| స త్వం ధర్మపరః భూత్వా కాశ్యపాయ వసుంధరాం దత్వా కృతకేతనః మహేంద్రవనం ఉపాగమ్య (వసతి చ)||

తా|| "అట్టి నీవు ధర్మపరుడవై కాశ్యపునికి రాజ్యమును ఇచ్చి వనవాసమునకై మహేంద్రగిరి వచ్చితివి".

మమ సర్వవినాశాయ సంప్రాప్తస్త్వం మహామునే |
న చైకస్మిన్ హతే రామే సర్వే జీవామహే వయమ్ ||

స|| హే మహామునే త్వం మమ సర్వమ్ వినాశాయ సంప్రాప్తః | అస్మిన్ రామే హతే వయం సర్వే న జీవామహే ||

తా|| " ఓ మహామునీ నీవు నా సర్వమును నాశనము చేయుటకు వచ్చినవాడవు. మా రాముడు లేనిచో మేమెవ్వరమూ జీవించియుండము".

బ్రువత్యేవం దాశరథే జామదగ్న్యః ప్రతాపవాన్ |
అనాదృత్యైవ తద్వాక్యం రామమేభ్యభాషత ||

స|| ఇతి ఏవం దాశరథే బ్రువతి ప్రతాపవాన్ జామదగ్న్యః తద్వాక్యం అనాదృత్యైవ రామం ఏవ అభ్యభాషత ||

తా|| ఈ విథముగా దశరథుడు చెప్పుచుండగా, ఆ మాటలు వినకుండగనే మిక్కిలి ప్రతాపము గల ఆ జమదగ్ని కుమారుడు శ్రీరామునితో ఇట్లు పలికెను.

ఇమే ద్వే ధనుషీ శ్రేష్ఠే దివ్యే లోకాభివిశ్రుతే |
దృఢే బలవతీ ముఖ్యే సుకృతే విశ్వకర్మణే ||

స|| ఇమే ద్వే దివ్యే ధనుషీ లోకాభి శ్రేష్ఠే దృఢే ముఖ్యే బలవతీ విశ్వకర్మణే సుకృతే (ఇతి) విశ్రుతే |

తా|| "ఈ దివ్య ధనుస్సులు రెండూ లోకములో శ్రేష్ఠ మైనవి ధృఢమైనవీ ప్రముఖమైనవీ బలముగలవీ విశ్వకర్మ చే చేయబడినవి అని తెలిసినవిషయమే".

అతిసృష్టం సురైరేకం త్ర్యంబకాయ యుయుత్సవే |
త్రిపురఘ్నం నరశ్రేష్ఠ భగ్నం కాకుత్‍స్థ యత్ త్వయా ||
(ఇదం ద్వితీయం దుర్దర్షం విష్ణోర్దత్తం సురోత్తమైః ||

స|| హే నరశ్రేష్ఠ ! హే కాకుత్‍స్త ! యత్ త్వయా భగ్నం (తత్) ఏకం సురైః ( ధనుః) త్రిపురఘ్నం త్ర్యంబకాయ యుయుత్సవే (దత్తం)| ఇదం ద్వితియం దుర్దర్షం ధనుః సురోత్తమైః విష్ణోః దత్తమ్ |

తా|| "ఓ నరశ్రేష్ఠ ! ఓ కాకుత్‍స్థ ! ఒకటి నీచే భగ్నము చేయబడినది త్రిపురాంతకుని సంహారముకై పరమేశ్వరునికి ఇవ్వబడినది. ఇది రెండవది. తిరుగులేనిది. ఇది విష్ణువునకు దేవతలచే ఇవ్వబడినది".

తదిదం వైష్ణవం రామ ధనుః పరమభాస్వరమ్ |
సమానసారం కాకుత్‍స్థ రౌద్రేణ ధనుషా త్విదమ్ ||

స|| హే రామ తత్ ఇదం వైష్ణవం ధనుః పరమభాస్వరమ్ | హే కాకుత్‍స్థ రౌద్రేణ ధనుషా ఇదం సమానసారం||

తా|| "ఓ రామా ఇది విష్ణువు యొక్క ధనస్సు మిక్కిలి తేజోమయమైనది. ఓ కాకుత్‍స్థ ఇది శివుని ధనస్సు తో సమానమైనది" .

తదా తు దేవతాస్సర్వాః పృచ్ఛంతి స్మ పితామహమ్ |
శితికంఠస్య విష్ణోశ్చ బలాబలనిరీక్షయా ||

స|| తదా దేవతాః సర్వే పితామహం శితికంఠస్య విష్ణోశ్చ బలాబలనిరీక్షయా పృఛ్ఛంతి స్మ |

తా|| "అప్పుడు దేవతలందరూ శివ విష్ణువుల బలాబలములను ఎఱుగ దలిచి బ్రహ్మను ప్రశ్నించిరి".

అభిప్రాయం తు విజ్ఞాయ దేవతానాం పితామహః |
విరోధం జనయామాస తయో స్సత్యవతాం వరః||

స|| దేవతానామ్ అభిప్రాయం తు విజ్ఞాయ పితామహః తయోః సత్యవతాం వరః విరోధం జనయామాస |

తా|| "దేవతల ఉద్దేశమును ఎఱిగి పితామహుడు వారిద్దరి మధ్య విరోధము కలిగించెను".

విరోధేచ మహద్యుద్ధం అభవత్ రోమహర్షణమ్ |
శితికంఠస్య విష్ణోశ్చ పరస్పరజిగీషుణోః ||

స|| పరస్పరజిగీషుణోః శితికంఠస్య విష్ణోః చ విరోధేచ మహత్ యుద్ధం అభవత్ |

తా|| "పరస్పరము విజయము కోరుచున్న శివ విష్ణువులమధ్య మహత్తరమైన యుద్ధము జరిగెను".

తదా తు జృంభితం శైవం ధనుర్భీమపరాక్రమమ్ |
హూంకారేణ మహాదేవః స్తంభితోsథత్రిలోచనః ||

స|| తదా తు హుంకారేన భీమపరాక్రమమ్ శైవం ధనుః జృంభితమ్ | మహాదేవః త్రిలోచనః స్తంభితః ||

తా|| "అప్పుడు హుంకారముతో మహాపరాక్రమము గల శివ ధనస్సు తేజోవిహీనమయ్యెను. మహదేవుడైన ఆ ముక్కంటి స్తంభితుడయ్యెను".

దేవైస్తదా సమాగమ్య సర్షిసంఘస్సచారిణైః |
యాచితౌ ప్రశమం తత్ర జగ్మతుస్తౌ సురోత్తమౌ ||

స|| తదా స ఋషి సంఘః స చారిణైః దేవైః తత్ర సమాగమ్య సురోత్తమౌ ప్రశమం యాచితౌ జగ్మతుః ||

తా|| "అప్పుడు ఋషిసంఘములు చారణులతో కూడిన దేవతలు వచ్చి వారిని ప్రశాంతపరిచిరి".

జృంభితం తద్ధనుర్దృష్ట్వా శైవం విష్ణుపరాక్రమైః |
అధికం మేనిరే విష్ణుం దేవాస్సర్షిగణాస్తదా ||

స|| విష్ణుపరాక్రమైః జృంభితం తత్ శైవం ధనుః దృష్ట్వా దేవాః స ఋషిగణాః విష్ణుం అధికం మేనిరే ||

తా|| "విష్ణుపరాక్రమము తో తేజో విహీనమైన శివ ధనస్సు చూచి ఋషిగణములు విష్ణువుయొక్క ఆధిక్యతను గ్రహించిరి".

ధనూరుద్రస్తు సంక్రుద్ధో విదేహేషు మహాయశాః |
దేవరాతస్య రాజర్షేః దదౌ హస్తే ససాయకమ్ ||

త|| రుద్రః తు సంక్రుద్ధౌ ధనుః విదేహేషు మహాయశాః రాజర్షేః దేవరాతస్య హస్తే స సాయకమ్ దదౌ||

తా|| "మహదేవుడు క్రుద్ధుడై విదేహమహరాజు మహాయశోవంతుడు రాజర్షి అగు దేవరాతుని వద్ద ఆ ధనస్సును న్యాసముగా ఉంచెను".

ఇదం చ వైష్ణవం రామ ధనుః పరపురంజయమ్ |
ఋచీకే భార్గవే ప్రాదాత్ విష్ణుస్సన్న్యాసముత్తమమ్ ||

స|| హే రామ ! ఇదం వైష్ణవమ్ పరపురంజయమ్ విష్ణుః ధనుః ఉత్తమమ్ న్నాసమ్ భార్గవే ఋచీకే ప్రాదాత్ ||

తా|| "ఓ రామా ! ఈ పరపురములను నాశనము చేయునట్టి ఈ ఉత్తమమైన వైష్ణవ ధనస్సు భార్గవుడగు ఋచీకునకు న్యాసముగా ఉంచెను".

ఋచీకస్తు మహాతేజాః పుత్త్రస్యాప్రతికర్మణః |
పితుర్మమ దదౌ దివ్యం జమదగ్నేర్మహాత్మనః ||

స|| మహాతేజః ఋచీకః మమ పితుః అప్రతికర్మణః పుత్రస్య మహాత్మనః జమదగ్నేః దివ్యం ( ధనుః) దదౌ ||

తా|| "మహాతేజోవంతుడైన ఋచీకుడు ప్రతీకారముచేయని వాడు మహాత్ముడు అగు నా తండ్రి జమదగ్నికి ఇచ్చెను".

న్యస్త శస్త్రే పితరి మే తపోబలసమన్వితే |
అర్జునో విదధే మృత్యుం ప్రాకృతాం బుద్ధి మాస్థితః ||

స|| అర్జునః ప్రాకృతాం బుద్ధిం ఆస్థితః తపోబలసమన్వితే న్యస్త శస్త్రే మే పితరి మృత్యుం విదధే |

తా|| "అర్జునుని ప్రాకృతమైన బుద్ధితో తపో బలసమన్వితుడైన నాతండ్రి అస్త్ర సన్న్యాసము చేసియుండగా ఆయనను వధించెను".

వధమ ప్రతిరూపం తు పితుశ్శ్రుత్వా సుదారుణమ్ |
క్షత్రముత్సాదయన్ రోషాత్ జాతం జాతమనేకశః ||

స|| పితుః సుదారుణమ్ వధం శ్రుత్వా రోషాత్ జాతం జాతం అనేకశః క్షత్రం అప్రతిరూపమ్ ఉత్సాదయన్ ||

తా|| "తండ్రియొక్క దారుణమైన వధను విని కోపముతో పుట్టినవారిని పుట్టి నట్లే అనేకసార్లు తుదముట్టించితిని".

పృథివీం చాఖిలాం ప్రాప్య కాశ్యపాయ మహాత్మనే |
యజ్ఞస్యాంతే తదా రామ దక్షిణాం పుణ్యకర్మణే ||
దత్వా మహేంద్రనిలయః తపోబలసమన్వితః |
స్థితోస్మి తస్మింస్తప్యన్ వై సుసుఖం సురసేవితే||

స|| అఖిలం పృథివీం ప్రాప్య యజ్ఞస్య అంతే మహాత్మనే పుణ్యకర్మణే కాశ్యపాయ దక్షిణామ్ దత్త్వా సుర సేవితే మహేంద్ర నిలయః తస్మిన్ తప్యన్ తపో బలసమన్వితః సుసుఖమ్ స్థితోస్మి వై ||

తా|| " సమస్త భూమండలము పొంది యజ్ఞము చివరిలో పుణ్యకర్మణుడగు కాశ్యపునికి దక్షిణ గా ఇచ్చి దేవతలు సంచరించునట్టి మహేంద్ర పర్వతము నిలయముగా తపస్సుచేయుచూ తపోబలసమన్వితుడనై సుఖముగా ఉంటిని".

అద్యతూత్తమ వీర్యేణ త్వయా రామ మహాబల |
శ్రుతవాన్ ధనుషో భేదం తతోsహం ద్రుతమాగతః ||

స|| హే మహాబల ! హే రామ ! ఉత్తమ వీర్యేణ త్వయా ధనుషో భేదం శ్రుతవాన్ తతః అహం ద్రుతం ఆగతః|

తా|| "ఓ మహాబల ! ఓ రామా ! నిరుపమాన శౌర్యముతో నీచేత ధనస్సు భేదించబడిన మాట విని నేను వెంటనే ఇచటికి వచ్చితిని".

తదిదం వైష్ణవం రామ పితృపైతామహం మహత్ |
క్షత్రధర్మం పురస్కృత్య గృహ్ణీష్వ ధనురుత్తమమ్ ||

స|| తత్ పితృపైతామహం మహత్ ఇదం వైష్ణవం ఉత్తమమ్ ధనుం క్షత్రధర్మం పురస్కృత్య గృహ్ణీష్వ ||

తా|| "ఈ తాతముత్తతలనుంచి వచ్చిన మహత్తరమైన ఉత్తమమైన ఈ వైష్ణవ ధనస్సు క్షత్రియధర్మముగా గ్రహించుము".

యోజయస్వ ధనుః శ్రేష్ఠే శరం పరపురంజయమ్|
యది శక్నోషి కాకుత్‍స్థ ద్వంద్వం దాస్యామి తే తతః ||

స|| ధనుః శ్రేష్ఠే పరపురంజయం శరం యోజయస్వ | హే కాకుత్‍స్థ ! యది శక్నోషి తతః తే ద్వంద్వం దాస్యామి |

తా|| "ఈ శ్రేష్ఠమైన శత్రుపురములను జయించునట్టి ధనస్సులో బాణమును సంధింపుము. ఓ కకుత్‍స్థ అట్లు చేయగలిగినచో నాతో ద్వంద్వయుద్ధము చేయుటకు నీకు అనుమతిఇచ్చెదను".

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే పంచసప్తతిమస్సర్గః ||

ఈ విధముగా వాల్మీకిరామాయణములో బాలకాండలో దెబ్బది అయిదవ సర్గ సమాప్తము ||

||ఓమ్ తత్ సత్||